బ్రేకింగ్ : కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజు కరోనా మహమ్మారి కేసులు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. ఇప్పటికే.. ఈ బారీన చాలా మంది ప్రముఖులు పడ్డారు. ఇక తాజాగా తమిళ్‌ స్టార్‌ హీరో కమల హాసన్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో కమల్‌ హాసన్‌ ప్రకటించారు.

” కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని… దానితో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు కమల్‌ హాసన్‌. సోమ వారం మధ్యాహ్నం కమల్‌ హాసన్‌ తాను ఆస్పత్రి లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్‌ చేశారు. కరోనా కారణంగా ప్రస్తుతం తాను ఆస్పత్రిలోనే ఐసోలేషన్‌ లో ఉన్నట్లు ప్రకటించారు. అలాగే.. ఈ మధ్య కాలం లో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించు కోవాలని కోరారు కమల్‌ హాసన్‌. కరోనా పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.