ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు ఇవి..మనకు మాత్రం

-

మనం ఫ్రూట్ మార్కెట్ కి వెళ్లినప్పుడు బేరాలు ఆడి, ఆ షాప్ అతన్ని ఎలాగోలా కన్విన్స్ చేసి మొత్తానిక చెప్పినరేటు కంటే కాస్త తక్కువకే తీసుకుంటాం. ముఖ్యంగా మనం అమ్మవాళ్లతో వెళ్లినప్పడు బాగా చూడొచ్చు. పక్కన నుల్చున్న మీకు అదంతా కొంచెం ఇరిటేటింగ్ గానే అనిపిస్తుంది. ఏంటమ్మ ఇది, షాపు అతను చెప్పినరేటుకే కొనేయ్యెచ్చుగా అంటే..ఇది నీకు ఇప్పుడు అర్థంకాదే..పెద్దేతే తెలుస్తుంది. మనలో చాలామంది అమ్మలు చెప్పే రొటీన్ డైలాగ్.. కానీ అలా బేరమాడి కొనుకున్నే ఈ పండ్లే కొన్ని దేశాల్లో ఎంత రేటు ఉంటాయో తెలిస్తే..నోరెళ్లబెడతారు.ఎందుకో తెలుసా.. వీటిని కనీసం టచ్ చేయడం కాదు కదా.. బేరం కూడా ఆడలేము.

వీటిధర వందలో వేలుకాదు, లక్షల్లో ఉంటుంది. ఇలా లక్షలు పెట్టి ఎవరైనా కొంటారా అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నే. అయితే ఆ పండ్లు ఏంటంటే..

మామిడికాయ అందరికీ ఇష్టమే..వేసవికాలంలో లొట్టలేసుకుంటూ తింటుంటాం. మనం డబన్లో కొంటాంకదా..డజన్ 100-300 వరకూ ఉంటుంది. ఇది 2010 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో టాప్ ఎండ్ రకానికి చెందిన 12 మామిడి పండ్ల ట్రే 50,000 డాలర్లకు అమ్ముడైంది.
అంటే మన కరెన్సీలో చూస్తే రూ.37,23,127 అన్నమాట. ఆస్ట్రేలియాలో 1998 నుండి మామిడి వేలం నిర్వహించడం ఒక ఆనవాయితీ కాగా బ్రిస్బేన్‌లో జరిగిన ఒక వేలం పాటలో ఈ రికార్డు ధర నమోదైంది. ఇలా కొన్ని దేశాలలో లభించే మామిడి కాయ రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు పలుకుతుంది.

రూబీ రోమన్ ద్రాక్ష.. ఈ పండ్లు కూడా జపాన్ లో కనిపిస్తాయి. ఒక కార్టన్ రూబీ ద్రాక్ష ఏడు లక్షల రూపాయల కంటే ఎక్కువే. ఈ ద్రాక్షను దాని ఖరీదు కారణంగానే ధనవంతుల ఫలం అంటారు. 2016లో రూబీ రోమన్ ద్రాక్ష ఒక్క గుత్తి రూ.11 లక్షలకు పైగా పలికిందట.

పుచ్చకాయ కూడా మనదగ్గర బాగా దొరికే పండు. పుచ్చకాయలో ‘డెన్సుకే’ రకం అనేది చాలా అరుదైన పండు. దీనిని జపాన్‌లోని హక్కైడోలో పండిస్తారు. ఇది పండు మొత్తం నల్లగా ఉంటూ ఇతర స్థానిక రకాలైన పండ్ల కన్నా తియ్యగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నా జపాన్ లో మాత్రం స్పెషల్ పండే. అందుకే అక్కడ ఈ పండు ఎల్లప్పుడూ అధిక ధరకు అమ్ముతారు. ఇది 2014లో ఒకటి ఆరువేల డాలర్లకు అమ్ముడైంది. అంటే మన ధరలో ఇది రూ.3 లక్షలకు పైగా పలికిందనమాట.

యుబారి కింగ్ మెలోన్స్.. ఈ పండు ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. ఈ పండు కూడా జపాన్ లో పండించబడుతుండగా జపాన్ వెలుపల ఎక్కువగా ఈ పండును ఎగుమతి చేయరు. జత పండ్లు 2018లో రూ.21,81,752కు అమ్ముడయ్యాయి.

గిగాంటెల్లా మాగ్జిమ్.. యూకేలోని గిగాంటెల్లా మాగ్జిమ్ అనే స్ట్రాబెర్రీస్‌ సాధారణ స్ట్రాబెర్రీల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. ప్రతి స్ట్రాబెర్రీ పండు టెన్నిస్ బంతి పరిమాణంలో పెద్దదిగా పెరుగుతూ ఒక కొత్త రకం రుచిని కలిగి ఉంటుందట. అందుకే 2017లో జరిగిన ఒక వేలంలో గిగాంటెల్లా మాగ్జిమ్ రకం స్ట్రాబెర్రీ ఒకటి రూ. 2,39,719 పలికింది.

Read more RELATED
Recommended to you

Latest news