నిరుద్యోగానికి మరో ప్రాణం బలి… నోటిఫికేషన్ రాకపోవడంతో యువకుడి బలవన్మరణం

ఉన్నత చదువులు చదివినా… టాలెంట్ ఉన్నా.. చాలా మంది యువకులకు ఉద్యోగాలు రావడం లేదు. మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితి. కొంతమంది కళ్లు కాయలు కాచేలా.. రేయింబవళ్లు చదివినా.. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు రావడం లేదు. ఓ వైపు వయస్సు 30ల్లోకి చేరినా కెరీర్ లో స్థిరపడకపోవడం.. వివాహాలు కాకపోవడంతో చాలా మంది యువత నిరాశలో ఉన్నారు. దీంతో కొంతమంది మనస్తాపం చెంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తెలంగాణలో  ప్రభుత్వ నోటిఫికేషన్లు రాకపోవడంతో కొంత మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. తాగాగా మరో ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

hanging-suicide

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ, బుద్దికొండ గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్తాపానికి గురైన దాసరి ఓంకార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉన్నత చదువులు చదివిన ఓంకార్ నోటిఫికేషన్లు రావడం లేదని మనస్థాపం చెంది రాత్రి పంట పొలంలో ఉరి వేసుకున ఆత్మహత్య చేసుకున్నాడు.