బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు సిబిఐకి సుప్రీం కోర్టు అప్పగించటం దేశవ్యాప్తంగా కాస్త సంచలనంగానే ఉంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు సిబిఐ ఎవరినీ దోషులుగా తెలుస్తుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రేపటి నుంచి సిబిఐ దీనికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలంటున్నాయి.
ఈ తరుణంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ట్విట్టర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్ ని మానసికంగా వేధించిన వారిలో వీరి పేర్లను అసలు మర్చిపోవద్దు అంటూ, ఒక ఆరుగురు పేర్లను తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది కంగనా. ఏక్తా కపూర్, దీపికా పదుకొనే, కరణ్ జోహార్, అలియా భట్, మహేష్ బట్, రియా చక్రవర్తి పేర్లను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.