ఢిల్లీకి వెళ్లిన సీఎం.. ప్రధానమోదీ ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయలేదు- పొన్నాల

కేసీఆర్ ఢిల్లీ టూర్ పై విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామన్న ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ టూర్ పై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. తాజాగా కేసీఆర్ ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యారు. సీఎంకు రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ప్రధాని మోదీ ఇంటి వద్ద ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. ఆయనకు మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం తెలంగాణకు అవమానమన్నారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం అర్రలో నుంచి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. తాడో పేడో తేల్చుకుంటానని మాట్లాడిన ఆయన ఢిల్లీలో ఏం జరిగిందో ఎందుకు చెప్పలేదని పొన్నాల నిలదీశారు.