స్వయంకృషితో ఎదిగిన ప్రియాంకను భారత్ వదిలి పారిపోయేలా చేశాడు కరణ్ జోహార్.. కంగనా

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తాజాగా తను హాలీవుడ్ కి వెళ్ళిపోవడానికి అసలు కారణాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న రాజకీయాలు తాను తట్టుకోలేక అక్కడి నుంచి వచ్చేసానని చెప్పుకొచ్చారు కాగా ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారగా ప్రస్తుతం ఈ విషయం చర్చకు దారి తీసింది. కొందరు ప్రియాంక చోప్రాను విమర్శిస్తుండగా మరికొందరు మాత్రం ఆమెకు సపోర్టుగా నిలిచారు ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ ప్రియాంక చోప్రా కు మద్దతుగా నిలబడ్డారు. బాలీవుడ్ లో కొందరు ప్రియాంకను వేధించారు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ్రాట్స్ తాజాగా ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. తన స్నేహితురాలైన ప్రియాంక చోప్రాను కరణ్ జోహార్ బ్యాన్ చేశారని అతని వేధింపులు తట్టుకోలేకే బాలీవుడ్ ను ప్రియాంక వదిలిపెట్టారని చెప్పుకొచ్చారు. స్టార్ హీరో షారుక్ ఖాన్ తో ప్రియాంక క్లోజ్ గా ఉండటం చూడలేకే కరణ్ జోహార్ ఆమెపై వేధింపులకు దిగారు అంటూ ఆరోపించింది.

ట్విట్టర్ వేదికగా ప్రియాంకకు మద్దతుగా నిలిచిన కంగనా.. “ప్రియాంక బాలీవుడ్ గురించి ఇదే విషయాలు చెప్పాలని అనుకున్నారు. పరిశ్రమలో కొందరు గ్యాంగ్ గా మారి ఆమెను వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె బాలీవుడ్ నుండి పారిపోయింది. స్వయంకృషితో ఎదిగిన ఒక మహిళను భారత్ వదిలి పారిపోయేలా చేశాడు. కరణ్ జోహార్ ఆమెను బ్యాన్ చేశాడనే విషయం అందరికీ తెలిసిందే. షారుక్ ఖాన్ తో ప్రియాంక చోప్రా స్నేహం చేయడం కరన్ జోహార్ కు నచ్చలేదు.. ఈ విషయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే వీటిపై అప్పట్లో ఎన్నో కథనాలు వచ్చాయి.

ఎలాంటి సినీ నేపద్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చేవారిని వేధించే మాఫియాకు ప్రియాంక చోప్రా దొరికిపోయింది. ఆమె దేశం వదిలి పారిపోయేంతవరకు వేధించారు. బాలీవుడ్ సినీ పరిశ్రమ సంస్కృతిని నాశనం చేసినందుకు కరణ్ జోహార్ కచ్చితంగా బాధ్యత వహించాలి. అమితాబచ్చన్, షారుఖ్ ఖాన్ కూడా ఎలాంటి సినీ నేపద్యం లేకుండానే ఇండస్ట్రీకి వచ్చారు. అయితే వారు ఇండస్ట్రీకి వచ్చే సమయంలో ఇలాంటి విషయాలు లేకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ నిలదొక్కుకోగలిగారు..” అంటూ కంగనా రాసుకు వచ్చారు.. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news