గాంధీ నెహ్రూల పై కంగనా షాకింగ్ కామెంట్స్..!

ఉక్కుమనిషిగా భారత ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎంతోమంది ఆయనకు నివాళులు అర్పిస్తున్న విషయం తెలిసిందే, రాజకీయ సినీ ప్రముఖులు ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయన గొప్పతనాన్ని చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ కాంట్రవర్షియల్ బ్యూటీ కంగనా రనౌత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేవలం గాంధీజీని సంతోషపెట్టడానికి మాత్రమే వల్లభాయ్ పటేల్ భారత ప్రధాని అయ్యే అవకాశాన్ని కూడా త్యాగం చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్.

జవహర్ లాల్ నెహ్రూ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరూ అని గాంధీ నమ్మారని అయినప్పటికీ వల్లభాయ్ పటేల్ బాధపడలేదు అంటూ చెప్పుకొచ్చింది. కానీ గాంధీజీ తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని దశాబ్దాలపాటు దేశం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంది అంటూ ట్వీట్ చేసింది కంగనారనౌత్. భారత ఉక్కు మనిషి గా అందరి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించిన వల్లభాయ్ పటేల్ జయంతి శుభాకాంక్షలు తెలిపింది.. మాకు అందరికీ అఖండ భారతాన్ని అందించిన గొప్ప మహానుభావులు మీరు అంటూ వ్యాఖ్యానించింది కంగనా రనౌత్.