ఉప ఎన్నికతో అధికారంలోకి వస్తాం..!

-

త్వరలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో జ్యోతిరాదిత్య సింధియా వర్గం కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసి అందరూ ఎమ్మెల్యే స్థానాలకు రాజీనామా చేశారు. దీంతో కమల్ నాథ్ నేతృత్వంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త కుప్పకూలి పోయింది. ఇక నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగేందుకు అంతా సిద్ధమైంది. నవంబర్ 3వ తేదీన రాష్ట్రంలోని 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే మొత్తానికి మొత్తంగా 28 28 నియోజకవర్గాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది అదే అధికార బీజేపీకి మాత్రం 9 సీట్లు వస్తే చాలు ఏకంగా 230 సీట్ల కు చేరుతుంది బిజెపి బలం. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ … మధ్య ప్రదేశ్ లో ఉప ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారం చేజిక్కించుకుంటాము అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news