Kanguva: కంగువాలో ఉధిరన్ గా బాబీ డియోల్…

-

శివ దర్శకత్వంలో హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ.స్టార్ హీరో సూర్య టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ . ఈ సినిమాలో కథానాయికగా దిశా పటాని నటిస్తుంది.ఈ మూవీ 3d ఫార్మాట్లో సందడి చేయనుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ పోస్టర్లు, గ్లింప్స్ ‌ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇటీవలే మేకర్స్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ షేర్ చేసిన కొత్త లుక్‌లో సూర్య చేతికి టాటూస్‌ కనిపిస్తున్నాయి.

ఇటీవలే యానిమల్ చిత్రంలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించిన బాబీడియోల్ ఈ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా బాబీ డియోల్ పుట్టినరోజు కావడంతో అదిరిపోయే అప్‌డేట్‌ అందించారు.ఈ సంద‌ర్భంగా చిత్రం నుంచి బాబీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో బాబీ ఒక తెగకు సంబంధించిన నాయ‌కుడిగా క‌నిపిస్తున్నారు. తెగ‌కు సంబంధించిన ప్ర‌జలు త‌నను మొక్కుతున్నట్లు ఈ పోస్ట‌ర్ లో చూపించారు . ఇక ఈ చిత్రంలో బాబీ ఉధిరన్ గా క‌నిపించ‌బోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news