U.P : లోక్‌సభ సీట్లు ప్రకటించేసిన అఖిలేష్…

-

ఓ వైపు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇండియా కూటమించి విడిపోతున్నట్లు ప్రకటించక ముందే, మరోవైపు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటన గందరగోళం సృష్టిస్తుంది. ల్. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.

అఖిలేష్ యాదవ్, అశోక్ గెహ్లాట్ మధ్య చర్చలు జరుగుతున్నాయని , ఆ చర్చలు ముగిసిన తర్వాతే ఫార్ములా ఏమిటనేది చెప్పగలమని జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఇక సీట్ల షేరింగ్‌పై తనకు ఎలాంటి సమాచారం లేదని ,సీట్ల పంపకాలపై సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రీయ లోక్‌ దళ్ తో 7 సీట్లలో పోటీ చేయనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ఖరారు చేసింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 71 సీట్లు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 5 , కాంగ్రెస్-2, ఆర్ఎల్‌డీ ఒక సీటు గెలుచుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news