టిడిపిలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ

-

ఇటీవల బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి మంగళగిరి లో పచ్చ కండువా కప్పుకున్నారు. కన్నాతో పాటు ఉమ్మడి గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల నుంచి భారీగా కాపు సామాజిక వర్గ నేతలు కూడా టిడిపి కండువా కప్పుకున్నారు. మంగళగిరి టిడిపి పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీతో చేరుకున్న ఆయనకు చంద్రబాబు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఏపీ పునర్విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 2014లో కన్నా కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి పరిస్థితి బాగోలేదనే ఆలోచనతో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. రాష్ట్రంలో పార్టీ నాయకత్వం, పనితీరుపై ఆయన చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బిజెపి పార్టీకి రాజీనామా చేసి నేడు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news