జీవితంలో అనుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వలేరు. సక్సెస్ అవ్వాలంటే టైం పడుతుంది. దానికి తగ్గ కృషి కూడా చేయాలి. చాలా మంది జీవితంలో ఎన్నో కలలని కంటూ వుంటారు. కానీ అన్ని ఫలించకపోవచ్చు. ఇద్దరు యువకులు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తర్వాత ఉద్యోగంలో చేరారు కానీ ఉద్యోగాన్ని వదులుకొని బిజినెస్ ని మొదలుపెట్టారు. ఫైనల్ గా సక్సెస్ అయ్యారు.
మరి ఇక ఈ ఉద్యోగుల సక్సెస్ స్టోరీ ని ఇప్పుడు చూద్దాం. ఆర్ కలైకతిరవన్, ఎ కృష్ణసామి వీళ్ళు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు చదువు పూర్తి అయ్యాక చెన్నైలోనే ఉద్యోగం వచ్చింది. కానీ దాన్ని వదిలేసుకొని వ్యాపారంని స్టార్ట్ చేసారు. ‘డ్రై ఫిష్’ విక్రయించాలని వీళ్ళు నిర్ణయించుకున్నారు. రెండేళ్ల తర్వాత కృష్ణసామి కూడా కలైకతిరవన్ తో కలిసి ఈ వ్యాపారం చెయ్యాలని అనుకున్నాడు.
ఇంట్లో వాళ్ళు ఉద్యోగాన్ని వదులుకుంటే పెళ్లి కాదని చెప్పడంతో ఇతను ఉద్యోగాన్ని వదులుకోలేదు పెళ్లి తర్వాత తన భార్యకు చెప్పి ఈ వ్యాపారం లోకి దిగాడు. తన స్నేహితుడు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టినప్పుడు నుండి కూడా కృష్ణ స్వామి సహాయం చేస్తూనే ఉన్నాడు. బెంగళూరు నుండి ఆ ఊరికి తిరుగుతూ ఉండేవాడు. వ్యాపారంలో ఫైనల్ గా వీళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు. నాణ్యమైన డ్రై ఫిష్ లని వీళ్ళు ఎంచుకొని ప్యాక్ చేసి సేల్ చేస్తూ వుంటారు. అలానే వాసన లేకుండా చూస్తారు.
తక్కువ నాణ్యత ఉన్న వాటిని వీళ్ళు అస్సలు అమ్మారు. వీరికి కావాల్సిన నాణ్యతతో ఉన్న డ్రై ఫిష్ లని వీళ్ళు ఎంచుకున్నారు వాటిని సరఫరా చేయడానికి ఒక వ్యక్తి అంగీకరించాడు అయితే శ్రీలంకలో దొరికే చేపలకి ఏమాత్రం ఇవి తీసిపోవు. నాణ్యత విషయంలో అసలు ఏమాత్రం తక్కువగా లేవు ఈ చేపలు. ఆన్లైన్లో వీళ్ళు విక్రయించాలని అనుకున్నారు ఇప్పుడు నెలకి మూడు లక్షలు పైగా అమ్మకాలని చేస్తున్నారు. 30 రకాల ఎండు చేపల్ని వంద నుండి 400 వరకు విక్రయిస్తుంది ఇప్పటికే నెలకి 15 లక్షల టర్నోవర్ కి చేరుకున్నారు. మొదటి ఏడాది రెండు కోట్ల టర్న్ ఓవర్ సాధించారు ఈ స్నేహితులు. ఇలా వీళ్ళు ఈ బిజినెస్ తో సక్సెస్ అయ్యారు.