కేసీఆర్ కట్టిన సెక్రటేరియేట్ అద్భుతం – వైసీపీ

-

కేసీఆర్ కట్టిన సెక్రటేరియేట్ అద్భుతమన్నారు కన్నబాబు. చంద్రబాబు కట్టిన సెక్రటేరీయేట్ చూడండి.. కేసీఆర్ కట్టిన సెక్రటేరియేట్ చూడండంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబుకు చాలా సార్లు అవకాశాలిస్తే.. ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేశారా..? అని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్ చేయాల్సింది క్షమాపణ యాత్ర అన్నారు కన్నబాబు.

లోకేషుకు ఆంధ్రప్రదేశ్ అని రాయడం కూడా రాదని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కన్నబాబు. సీఎం జగన్ గురించి మాట్లాడే స్థితిలో లోకేష్ ఉన్నారా..?లోకేషును లీడరుగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో బూతులు నేర్పినట్టు ఉన్నారన్నారు. అయ్యన్న ఒళ్లు బలిసి గంజాయి మత్తులో మాట్లాడినట్టుగా కన్పిస్తోంది. పిచ్చాస్పత్రి ఉంది కాబట్టి రాజధానిని మారుస్తున్నారని అయ్యన్న అంటారా..? అని మండిపడ్డారు.

సీఎం జగన్ను అంత అగౌరవంగా మాట్లాడతారా..? పిచ్చాస్పత్రిలో చూపించుకోవాల్సింది చంద్రబాబేనని తెలిపారు. టీడీపీ నేతలు ఇదే విధంగా మాట్లాడితే వైసీపీ నేతలు మాట్లాడే మాటలకు తట్టుకోలేరన్నారు. కొడాలి నానిని బూతుల మంత్రి అని బ్రాండింగ్ చేస్తారా..? చంద్రబాబు, లోకేష్, అయ్యన్న మాట్లాడే మాటలు సమ్మగా ఉన్నాయా..? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news