గ్రామ, సచివాలయ వార్డ్ ల ఉద్యోగులకు కన్నబాబు వార్నింగ్‌ !

-

గ్రామ సచివాలయ వార్డ్ ల ఉద్యోగులపై మంత్రి కన్నబాబు ఫైర్‌ అయ్యారు. గ్రామ సచివాలయ వార్డ్ ల ఉద్యోగులు సమ్మెకు దిగుతాము అని అనటం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూన్ లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. జూన్ లోపు ఎప్పుడైన చేస్తారన్నారు. టిడిపి హయాంలో 5 సంవత్సరాలకు కూడా ప్రోబిషన్ డిక్లర్ చేయ్యలేదని గుర్తు చేశారు. దేశంలో అబద్దాల ఫ్యాక్టరీ నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

వైస్సార్ రైతు భరోసా పేరుతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు. రైతుల కోసం అనేక అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎరువులు ఇబ్బంది లేకుండా మిగులు నిల్వలతో రైతుల కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వ0 వైసీపీ ప్రభుత్వం అని వెల్లడించారు. వ్యవసాయంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందని.. వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి చూడలేకే చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులకు సంబంధించి ఏవైనా సమస్య ఉంటే వెంటనే పరిస్కారం చేస్తామమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version