పెద్ద హోదాలలో ఉన్నావాళ్ళే రికార్డింగ్ డ్యాన్సులు వేశారు..తప్పేముంది : కన్నబాబు

-

క్యాసినో వ్యవహారంపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు..కొడాలి నాని లక్ష్యంగా చేసుకునే క్రమంలో చంద్రబాబు అండ్ కో ఒక దుర్మార్గమైన చర్యలను నిర్వహిస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఏదో విచ్చలవిడిగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. సిఎం జగన్ , కొడాలి నాని పై వారికున్న ద్వేషాన్ని చూపిస్తున్నారని మండి పడ్డారు.

తెరలపై రికార్డింగ్ డ్యాన్స్ లు వేసుకున్న వాళ్ళు కూడా రాష్ట్ర ప్రగతి దెబ్బతిందని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. దీని వల్ల రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నమన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబు అండ్ కో,పచ్చ బ్యాచ్ కు లేదని మండిపడ్డారు. గతంలో వీళ్ళు చేసిన విచ్చలవిడి చర్యలను మేము చూపిస్తామని.. పెద్ద పెద్ద హోదాలలో ఉన్నావాళ్ళే రికార్డింగ్ డ్యాన్సులు వేశారన్నారు. బిజెపి రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకునే క్రమంలో చంద్రబాబు బాటలో నడుస్తోందని ప్రజలకు అర్ధమవుతుందని.. ఈ విషయాన్ని సోము వీర్రాజు అర్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news