కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఇద్దరు నిర్మాతలపై పరువు నష్టం దావా వేసిన విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాల ప్రకారం నిర్మాతలు ఎన్ ఎన్ కుమార్ మరియు ఎం ఎన్ సురేష్ లు ఇటీవల మీడియా ముందు కిచ్చా సుదీప్ పైన సినిమా ఒప్పుకుని, అడ్వాన్స్ కూడా తీసుకుని.. .డేట్స్ ఇవ్వడం కుదరదు అంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ వారలు స్ప్రెడ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కిచ్చా సుదీప్ వారిపైన చట్ట పరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు. అతనిపై అనవసరంగా అసత్య ఆరోపణలు చేయడంతో కోపం తెచ్చుకున్న సుదీప్ వారిద్దరిపైనా పరువు నష్టం కింద దావా వేశారు. ఈ దావా లో తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో పాటుగా, రూ. 10 కోట్లు డబ్బును చెల్లించాలని లాయర్ ద్వారా నోటీసులు పంపించాడు. ప్రస్తుతం ఈ నోటీసులపై సదరు నిర్మాతలు సమాధానం ఇవ్వాల్సి ఉంది.