ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ‘కాంతార’ క్లైమాక్స్.. !

-

గత నెల 20న మొదలైన ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ సమరం ఆదివారం రాత్రి అర్జెంటీనా-ఫ్రాన్స్ మధ్య ముగిసిన ఫైనల్ పోరుతో ముగిసింది. గత టోర్నీలో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ ను పెనాల్టీ షూట్ అవుట్ లో ఓడించిన అర్జెంటీనా జగజజ్జేతగా నిలిచింది.

ఫ్రాన్స్ రన్నరప్ తో సంతోషపడింది. ఇది ఇలా ఉండగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంతారా ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా సంచలనాలు సృష్టించింది. అటు ఈ సినిమాపై చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే, కాంతార మీమ్స్ ఫీవర్ తాజాగా ఫిఫా వరల్డ్ కప్ 2022కి పట్టుకుంది. ‘కాంతార’ థీమ్ లో అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సి, డిగో మారడోనాలా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉత్తగా హల్ చల్ చేస్తోంది. కాంతార సినిమాలోని క్లైమాక్స్ సీన్ మాదిరిగా, మైదానంలో లియోనెల్ మెస్సి అలసిపోయి పడిపోతే డియెగో మారడోనా దేవుడిలా వచ్చి అతని నిద్ర లేపుతారట. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news