బిగ్ బాస్ కొత్త సీజన్ కి హోస్ట్ గా రానా..!

-

తెలుగులో బిగ్ బాస్ ఎట్టకేలకు నిన్నటితో ఆరవ సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది. సీజన్ మొదటి నుంచే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సింగర్ రేవంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే ఈ టైటిల్ విన్నర్ ను అనౌన్స్ చేసే క్రమంలో ఫినాలే ఎపిసోడ్ ను ఆసక్తికరంగా మలిచారు. మొత్తానికైతే రన్నర్ గా శ్రీహన్ రూ.40 లక్షల గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకొని.. శ్రీహాన్ విన్నర్ రేస్ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు రియాల్టీ షో కి ప్రధాన హైలైట్ గా నిలిచేది హోస్ట్ మాత్రమే. సీజన్ 3 నుంచీ ఇప్పటివరకు హోస్ట్ గా అలరించిన టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఆ బాధ్యతలకు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

ఈ క్రమంలోనే నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కి హోస్ట్ ఎవరు అనే విషయంపై ఆసక్తి నెలకొనింది. ఇకపోతే 2017లో తెలుగులో రియాల్టీ షో గా ప్రారంభమైన ఈ షో కి మొదటి సీజన్ హోస్టుగా ఎన్టీఆర్ చేశారు. హోస్ట్ గా చేయడమే కాదు తనదైన మాట కామెడీ యాక్షన్ తో సూపర్ సక్సెస్ అయ్యేలా చేశారు. తర్వాత రియాల్టీ షోని వరుస పెట్టి సీజన్లతో ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికీ 6 రెగ్యులర్.. ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ సీజన్లకు ప్రధాన హైలెట్గా నిలిచేది హోస్ట్ మాత్రమే.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హోస్ట్ నాగార్జున నెక్స్ట్ ఎపిసోడ్ కి రావడం లేదు అని కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కి హోస్ట్ రానా దగ్గుబాటి పేరు నాగార్జున సజెస్ట్ చేశారు అని తెలుస్తోంది. అయితే వచ్చే సీజన్ కి హోస్ట్ గా యంగ్ హీరో రానా దగ్గుబాటి రానున్నాడు అని సమాచారం . అంతేకాదు రానా ను నాగార్జుననే రెకమెండ్ చేసారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రానా కంటికి సర్జరీ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు హోస్ట్ గా చేయడానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news