ఏపీ సర్కార్ కు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఏపీ లోని అంగన్వాడీ కేంద్రాలకు పాలను సప్లై చేసే విధంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో గతంలో ఒప్పందం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ తక్షణమే 130 కోట్ల బకాయిలు చెల్లించాలని లేకపోతే ఏపీ లోని అంగన్వాడీ కేంద్రాలకు పాలను సరఫరా చేయలేమని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఏపీలోని అంగన్వాడీలకు పాలు సరఫరా చేయాలని 2020లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ప్రతి ప్రతి నెల 110 లక్షల లీటర్ల పాలను ఏపీ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం నుండి దిగుమతి చేసుకుంటోంది. అయితే నాలుగు నెలల నుండి డబ్బులు చెల్లించకపోవడంతో ఆ బకాయిలు మొత్తం రూ.130 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాల సప్లై నిలిపివేస్తామని హెచ్చరించింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.