కర్ణాటక బంద్.. నిర్మానుష్యంగా మారిన బెంగళూర్

-

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీసుకొచ్చిన తాజా వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కర్ణాటకలోని రైతు సంఘాల ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చారు. రైతు సంఘాలు చేపట్టిన ఈ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బెంగుళూరు నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు భారీ ఎత్తున చేపట్టారు. రైతు సంఘాలు చేపట్టిన బంద్ కు కాంగ్రెస్, జెడిఎస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు సహా 49 సంఘాలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి. బంద్ కు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ రైతులు స్వచ్చందంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బంద్ కారణంగా నిత్యం రణగొణ ధ్వనులతో బిజీబిజీగా ఉండే బెంగళూరు నగరంలో రహదారులు సైతం నిర్మానుష్యంగా మారాయి.

బెంగళూరులోకి రైతులు రాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటికే నగరంలో చేరుకున్న వారు ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలో పాల్గొంటున్నారు. అయితే చర్చలకు రావాలంటూ రైతు సంఘాలకు ముఖ్యమంత్రి యాడియురప్ప విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నాయకుల ఉచ్చులో పడవద్దని…అభ్యంతరకర అంశాలు ఉంటే తనతో చర్చించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. రైతులకు మేలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇక బంద్ నేపధ్యంలో బెంగళూరులో భద్రత కోసం ఇద్దరు అదనపు కమిషనర్లు, పది మంది డీసీపీలు, 60 మంది ఎసిపిలు, 140 మంది ఇన్స్పెక్టర్లు, సుమారు 300 మంది ఎస్ఐలు, 1500 సివిల్, ట్రాఫిక్ పోలీసులను మొహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news