పెట్రోల్ ధర పెంపుపై స్పందించిన కర్నాటక ముఖ్యమంత్రి

-

పెట్రోల్ ధరలను పెంచిన విషయంపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. పెట్రోల్ ధరల లీటర్‌కు రూ. 3 పెంచామని, అయినప్పటికీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే కర్ణాటకలో ఇంధన ధరలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం వ్యాట్‌ను పెంచినా కూడా రాష్ట్రంలో ఇంధనంపై పన్నులు ఇతర దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్రల కంటే తక్కువగానే ఉన్నాయని ముఖ్యమంత్రి ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో రాష్ట్ర వనరులను బీజేపీ ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని విమర్శించారు. గత రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై వ్యాట్‌ను తగ్గించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తన సొంత పన్నులను పెంచింది.ఈ అవకతవకల వల్ల కర్ణాటకకు ఆదాయం భారీగా తగ్గింది. కేంద్రం ప్రభుత్వం కర్ణాటక ప్రజలను మోసం చేసి తన ఖజానాను నింపుకుందని ఆరోపించారు.తాజాగా పెంచిన ఇంధన ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాకు నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తుందనితెలిపారు. కాగా,కర్ణాటకలోని బెంగళూరులో ఆదివారం నాటికి పెట్రోల్ లీటర్ ధర రూ.3 పెరిగి రూ. 102.84కి చేరగా, డీజిల్ రూ. 3.02 పెరిగి రూ. 88.95 వద్ద ఉంది

.

Read more RELATED
Recommended to you

Latest news