జూన్ 30లోపు ఆ వేలం పూర్తి చేయాలి.. తెలంగాణకు కేంద్రం డెడ్ లైన్

-

గనుల వేలంపై తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం కీలక సూచన చేసింది. జూన్ 30 వ తేదీ లోపు కనీసం ఆరు బ్లాకులకు వేలం నిర్వహించాలని స్పష్టం చేసింది. ఒక వేళ ఆ పనిని రాష్ట్రం చేపట్టకపోతే ఆ ప్రక్రియను తామే పూర్తి చేస్తామని కేంద్ర గనుల శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను రాసింది. తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఒక్క మినరల్ బ్లాక్ ను కూడా వేలం వేయలేదని కేంద్ర గనుల శాఖ పేర్కొంది.

ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి 11 బ్లాకుల జియాలాజికల్ నివేదికలను పంపించినట్టు అధికార వర్గాలు తెలిపారు. వీటిలో ఐదు సున్నపురాయి, ఐదు ఇనుప ఖనిజం, ఒకటి మాంగనీస్ బ్లాకు ఉన్నాయని, గనుల వేలం విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ పలుమార్లు గుర్తు చేసినప్పటికీ ఆ ప్రక్రియ నిర్వహించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో జూన్ 30 నాటికి కచ్చితంగా కనీసం ఆరింటికి వేలం పూర్తి చేయాలని లేఖలో స్పష్టం చేసింది. దేశంలో గనుల వేలం ప్రక్రియ 2015లో ప్రారంభం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట గడువులోగా వేలం ప్రక్రియను పూర్తి చేయకుంటే వాటిని వేలం వేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కేలా 2021లో నిబంధనలను సవరించారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 354 ప్రధాన మినరల్ బ్లాక్ లను వేలం వేయగా 48 చోట్ల ఉత్పత్తి ప్రారంభమైంది. కానీ తెలంగాణలో మాత్రం ఈ ప్రక్రియ జరగలేదని కేంద్రం ఆక్షేపించింది.

Read more RELATED
Recommended to you

Latest news