గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వన్ సైడెడ్ గా అధిక సీట్లను గెలుచుకుని అధికారాన్ని కైవశం చేసుకుంది. ఇక కాంగ్రెస్ సీఎంగా సీనియర్ రాజకీయ నాయకుడు సిద్దరామయ్యను ప్రకటించగా ప్రస్తుతం ఆయన పాలనలో చాలా బిజీ గా ఉన్నాడు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కర్ణాటక సీఎం పదవి గురించి ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే కుమారుడు మరియు మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం ఆదేశిస్తే కర్ణాటక సీఎం పదవిని చేపట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే రాష్ట్రంలో తీవ్రంగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ సీఎం ఉండగా ఎందుకు ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ సొంత పార్టీలో పెద్ద ఎత్తున సందేహాలు మొదలయ్యాయి.
అయితే నిన్న మీడియాతో మాట్లాడిన సిద్దరామయ్య ఈ టర్మ్ కి నేనే సీఎంగా ఉంటానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ప్రియాంక్ ఖర్గే ను సీఎం ను చేయడానికి తెరవెనుక మల్లిఖార్జున ఖర్గే ఏమైనా మాయ చేస్తున్నాడా చూడాలి ?