2025 లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి పసికూనగా ప్రపంచమంతా భావిస్తున్న ఆఫ్గనిస్తాన్ సరైన ఆటతీరుతో క్వాలిఫై అయింది. ఈ వరల్డ్ కప్ లో అంచనాలకు ఏ మాత్రం అందకుండా ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక మరియు నెదర్లాండ్ జట్లను ఓడించి సెమీస్ వైపుకు దూసుకువెళుతోంది. సెమీస్ కు వెళ్లాలంటే ఆఫ్గనిస్తాన్ ఆడనున్న తర్వాత రెండు మ్యాచ్ లలో తప్పక గెలవాల్సిందే. లేదా ఒకటి గెలిచినా మిగిలిన టీం ఫలితాల మీద ఆధారపడవల్సి ఉంది. కానీ ఆఫ్గనిస్తాన్ ఆడవాల్సిన రెండు మ్యాచ్ లు కూడా భారీ టీం ల మీదనే.. ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లతో ఆడనుంది. కాగా ఈ రోజు మ్యాచ్ ను గెలవడం ద్వారస వరల్డ్ కప్ లో నాలుగు మ్యాచ్ లు గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ కి క్వాలిఫై అయింది. ఈ ఘనత మొదటిసారి సాధించడంతో ఆ జట్టు ఆటగాళ్లతో సహా అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు.
ఈ జట్టు నుండి మేము ఈ తరహా ప్రదర్శన అస్సలు ఊహించలేదు అంటూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక ఇప్పటి వరకు చూస్తే మరో రెండు జట్లకు మాత్రమే ఛాంపియన్స్ ట్రోఫీ కి అర్హత సాధించే అవకాశం ఉంది. మరి ఆ జట్లు ఏమిటో తెలియాలంటే మరికొన్ని మ్యాచ్ లు ఎదురుచూడాలి.