అనుమానం పెను భూతం లా మారి…చివరికి..!

అనుమానం భార్యా భర్తలకు ప్రశాంతత లేకుండా చేస్తుంది. పచ్చని సంసారం లో నిప్పులు పోస్తుంది. కొన్ని సార్లు అనుమానం పెను భూతం అయితే హత్యలు ఆత్మహత్య ల వరకు దారి తీస్తుంది. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటక లోని రాయ చూరు లో చోటు చేసుకుంది. శాహబాద్ ప్రాంతం లో ఉంటున్న సిద్ధ లింగ తో శాంత కుమారి అనే మహిళలు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్ళైన నాటి నుండి ఇద్దరు అన్యోన్యంగా నే ఉంటున్నారు.

వీరికి ఆరు నెలల పాప కూడా ఉంది. అయితే భర్తకు మధ్యలో భార్య పై అనుమానం మొదలైంది. దాంతో చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు. ఆ చిత్ర హింసలు భరించలేక శాంతకుమారి ఆదివారం ఆరు నెలల పసికందు తో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.