ఈ మధ్యనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జయభేరి మోగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రజల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మాములుగా రాష్ట్రంలో పేదల కోసం రేషన్ ను ఇస్తున్న సంగతి తెలిసిందే, రేషన్ లో భాగంగా బియ్యాన్ని ఇవ్వడం తెలిసిందే. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే బియ్యం కు బదులుగా డబ్బులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక కేజీ బియ్యం కొనుగోలు చేయడానికి రూ. 34 వెచ్చిస్తున్నారు. కాగా ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా BPL కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యం ఇస్తామని మాటిచ్చారు. అయితే స్టాక్ లో బియ్యం లేకపోవడంతో ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి ప్రణాళికలు చేస్తున్నారట.
ఇక ఈ విషయం పట్ల కర్ణాటక ప్రజలు మరియు రాజకీయ వర్గాలు ఏ విధంగా స్పందించనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.