ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన ఈ రోజు నుండి రెండవ టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది, అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు కొన్ని ఓవర్ ల తర్వాత మైదానంలోకి కొందరు నిరసనకారులు దూసుకు వచ్చారు. జస్ట్ స్టాప్ ఆయిల్ అనే పేరుతో నిరసన తెలపడానికి వచ్చిన కొందరు సడెన్ గా గ్రౌండ్ లోకి పరుగులెత్తుకు వచ్చారు. దీనితో ఒక్కసారిగా ఆటగాళ్లు షాక్ తిన్నారు. పైగా నిరసనకారులు గ్రౌండ్ లో ఆరెంజ్ పొడి ను చల్లారు. అయితే ఇలా గ్రౌండ్ లోకి వచ్చిన నిరసనకారుల్లో ఒకరిని మాత్రమే ఇంగ్లాండ్ కీపర్ జానీ బైర్ స్టో మైదానం అవతలకు ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఈ కారణంగా మ్యాచ్ లో కొంచెం సేపు ఆలస్యం జరిగింది.
తర్వాత సజావుగా మ్యాచ్ మొదలైంది… కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆడుతున్నారు. క్రీజులో వార్నర్ మరియు ఖవాజా లు ఆడుతున్నారు.