‘కార్తికేయ2’ కలెక్షన్లకు పవన్‌ కళ్యాణ్‌ బ్రేక్‌ ?

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ” కార్తికేయ 2″. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మైథాలజికల్ ఫిల్మ్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.సినిమా రిలీజ్ అయి రెండు వారాలైనా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది.

ఇది ఇలా ఉండగా.. బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కార్తికేయ 2 మూవీ జల్సా స్పెషల్ షో కోసం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీలో దుమ్ముదులుపుతన్న కార్తికేయ2.. రెండు వారాలు గడిచినా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 100 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది.

అయితే సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమాను.. నిఖిల్ తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ఆపుకుంటున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 1 న హైదరాబాద్ ఓ మెయిన్ థియేటర్లో ‘జల్సా’ రీ రిలీజ్ అవుతున్న సందర్భంగా కార్తికేయ 2 షోని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రత్యేక షోల అనంతరం మళ్లీ ‘కార్తికేయ 2’ చిత్రం నార్మల్‌గా ఆ థియేటర్‌లో రన్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version