హిందీలో దుమ్మురేపుతోన్న కార్తికేయ 2.. వెయ్యి థియేటర్లలో షో !

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ” కార్తికేయ 2″. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మైథాలజికల్ ఫిల్మ్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

తెలుగు స్టేట్స్ తో పాటు ఇతర సెంటర్లలోనూ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ జరిగింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో మాత్రం కార్తికేయ 2 కి మంచి రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా చిత్రంలో నిఖిల్ నటనతో పాటు, బలమైన కధ ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తుందని విశ్లేషకులు తెలుపుతున్నారు.

అయితే… ఈ సినిమా ముఖ్యంగా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజు 50 థియేటర్లలో రిలీజ్‌ అయిన కార్తికేయ 2.. ఇప్పుడు 1000 థియేటర్లలో షో నడుస్తోంది. దీంతో ఓవరాల్‌ గా 3000 థియేటర్లలో కార్తికేయ 2 సినిమా నడుస్తోందన్న మాట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news