కాశ్మీర్లో ఎన్కౌంటర్ … మూడు రోజుల్లో రెండోది..

-

కాశ్మీర్లో భద్రతా బలగాలు వరసగా విజయాలు సాధిస్తున్నారు. ఎక్కడిక్కడ ఉగ్రవాదులని మట్టుబెడుతున్నారు. కొన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో రక్తపాతం స్రుష్టించేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నారు. తాజాగా మంగళవారం మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. యూరీ సెక్టార్లో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 7గురు మరణించగా మరొకరు బలగాల ఎదుట లోంగిపోయారు. ప్రస్తుతం జరిగిన ఎన్కౌంటర్ మూడు రోజుల్లో రెండోది కావడం గమనార్హం. గత ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు మరణించారు. బందిపోరా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఎదురుకాల్పుల్లో చనిపోయిన ఈ ఉగ్రవాదులు లష్కరేతోయిబా ఉగ్రసంస్థకు చెందిన వారు. గతంలో వీరు కాశ్మీర్ బీజేపీ నేత షేక్ వాసిమ్ బారీని చంపారు. కొన్నాళ్ల నుంచి కాశ్మీర్లో ఉగ్రమూలాలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేసుకుంటూ వస్తోంది. అయితే అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు ఉగ్రసంస్థలు అడపాదడపా దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్లోని బీజేపీ నాయకులను, అధికారులు టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news