షోపియాన్ లో ఎన్ కౌంటర్… ఇద్దరు టెర్రరిస్టుల హతం

కాశ్మీర్ లో మళ్లీ మరో ఎన్ కౌంటర్ జరిగింది. గత రెండు రోజుల్లో ఇది నాలుగో ఎన్ కౌంటర్. ఉగ్రవాదుల గురించి కాశ్మీర్ లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే వరస ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కాశ్మీర్ లోని షోపియాన్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

s srinivas martyr in jammu kashmir strike

వీరంతా లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదులుగా గుర్తించారు. ఇందులో ఇటీవల బీహార్ వీధి వ్యాపారిని హత్య చేసిన ఉగ్రవాది ముక్తార్ షా గా గుర్తించారు. మరో ఇద్దరిని డానిష్ అహ్మద్, యావర్ అహ్మద్ లుగా గుర్తించారు. ఎన్ కౌంటర్లో ఆర్మీతో పాటు సీఆర్పీఎఫ్, జమ్ము కాశ్మీర్ పోలీసులు జాయింట్గా పాల్గొన్నారు.  ఘటన సమయంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో కాశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు ఎక్కవ అవ్వడంతో పోలీసులు, ఆర్మీ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాయి.