ఈ రోజు, రేపు ఢిల్లీలో రెండు రోజులపాటు 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ రోజు, రేపు ఢిల్లీలో రెండు రోజులపాటు 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగనుంది.. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొనున్నారు.

జీఎస్టీ సంస్కరణలు, పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, వస్తువుల స్లాబుల్లో మార్పులు, రాష్ట్రాల పన్ను ఆదాయంపై ప్రభావం, రాష్ట్రాలు కోల్పోతున్న ఆదాయానికి పరిహారం వంటి అంశాలపై చర్చ జరుగనుంది. ప్రస్తుతం జీఎస్టీలో ఉన్న 12 శాతం, 28 శాతం స్లాబులను తొలగించాలనిన కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.