రాముడుకి అమ్మాయిల పిచ్చి…!

-

వివాదాస్పద దర్శకుడిగా ఉన్న కత్తి మహేష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. హిందువులు ఆరాధ్య దైవంగా భావించి రాముడుని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లో బహుజన సాహిత్య జాతర పేరిట జరిగిన ఒక కార్యక్రమ౦లో పాల్గొన్న కత్తి మహేష్… శ్రీ రాముడు పచ్చి తిరుగుబోతు అంటూ కామెంట్ చేసాడు.

అక్కడితో ఆగని మహేష్, శ్రీరాముడు స్త్రీలోలుడు గా అభివర్ణించాడు శ్రీరాముడు తన అంతఃపురం లోని మహిళలతో సరససల్లాపాలు సాగించే వాడని వ్యాఖ్యానించాడు. దీనితో ఒక్కసారిగా హిందూ సంఘాలు అతనిపై మండిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజకీయ పార్టీని ఆకట్టుకోవడానికి గాను మహేష్ ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేసాడని పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ అంశంపై అతను ఫేస్బుక్ లో మరికొన్ని వ్యాఖ్యలు చేసాడు. తన ఫేస్ బుక్ పేజీలో, తన కంటే భయంకరమైన హిందువు ఇంకెవరు లేరన్న అతను తాను గుడ్డిగా ఫాలో అయ్యే రకాన్ని కానని, తాను దళిత చార్వాకుడుని అని చెప్పుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే దీనిపై ఇప్పుడు హిందుత్వ సంస్థలు అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఎప్పుడు ఎవరో ఒకరిని విమర్శించి పబ్బం గడుపుకునే అలవాటు అతని సొంతమని అందులో భాగంగానే అతను ఈ వ్యాఖ్యలు చేసాడని అంటున్నారు. తనను జనం మర్చిపోతున్నారని భావిస్తున్న ప్రతీ సారి చిల్లర మాటలు మాట్లాడి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడుతున్నారు. అటు బిజెపి కార్యకర్తలు కూడా అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news