ప్లాన్ ప్రకారమే కౌశిక్ రాజీనామా.. కారెక్కడం ఖాయమేనా?

-

హుజురాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఇలా సడెన్ గా పార్టీకి రాజీనామా చేయడం వెనుక ఉన్న కారణాల గురించి అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి ఆయన వేరే పార్టీ నాయకులతో సాగించిన బేరసారాలకు సంబంధించి ఆడియోలు కలకలం రేపాయి. దీంతో టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నేతలు కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా రేపు ఉదయం లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఎప్పటి నుంచో కౌశిక్ రెడ్డి పార్టీ మారుతాడంటూ కాంగ్రెస్ నేతలే కామెంట్లు చేయడం గమనార్హం. ఇన్నాళ్లు ఆ వ్యాఖ్యలను కొట్టి పారేస్తూ… వచ్చిన కౌశిక్ రెడ్డి సడెన్ గా ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఈ పరిణామంతో చాలా మంది నాయకులు తాము ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పామని అంటున్నారు. హుజురాబాద్ లో జరుగుతున్న ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి చేరుతాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన టీఆర్ఎస్ లో చేరడమే కాకుండా ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడతాడని చెబుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి స్వయాన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధువు కావడం మరో విశేషం. ఇదిలా ఉండగా… కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news