బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు,బడుగులు, బలహీనులు గుర్తుకు రాలేదన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ. కవితకు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా! ఇన్ని రోజులు బీసీలను ఎందుకు పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. శంకరమ్మ కు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగండనీ ఆయన అన్నారు.
సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికీ తెలుసు అన్నారు. కాబట్టి బీసీకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వండనీ , శంకరమ్మ కు రాజ్యసభ సీటు ఇచ్చి మీ పాపాలు కడుక్కోండి అన్నారు. అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాగూ రాజ్యాలు విస్తరించుకునే పనిలో ఉన్నాడని అన్నారు. మీ నాన్న ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఫ్లోర్ లీడర్ గా దళితుడు కడియం శ్రీహరికి ఇవ్వండని ఆయన మాట్లాడారు. సినిమా వాళ్ళతో మీ ఆయనకు పనులు ఉంటాయని ఆయన మాట్లాడారు. తెలంగాణ భవన్ లో మీ తండ్రి, శాసనసభలో మీ అన్న ,బావ, మండలిలో నువ్వు కనిపిస్తావనీ రఘునందన్ రావు విమర్శించాడు. మీరు తప్ప మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరా అని ప్రశ్నించాడు.