రౌస్ ఎవెన్యూ కోర్టులో కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కీలక కామెంట్స్ చేశారు కవిత అరెస్టు అధికార దుర్వినియోగం అని చెప్పారు. అలానే ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ పెండింగ్లో ఉందన్నారు. గతం లో కవిత ఈడి విచారణకి హాజరయ్యారని గుర్తు చేశారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాలేదని తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంజక్షన్లు తీసుకున్నారు అని చెప్పారు.
బిపి గతంలో ఎన్నడూ లేనంతగా మారిపోయింది అని మెడికల్ రిపోర్టులు కూడా ఇంకా మాకు వైద్యులు ఇవ్వలేదని న్యాయవాది పేర్కొన్నారు. నిన్న సాయంత్రం హైదరాబాదు లో కవిత నివాసంలో సుదీర్ఘ సోదర తర్వాత ఆమెకి నోటీసులని పంపించారు తర్వాత అరెస్ట్ చేసే ఢిల్లీకి తరలించారు రవిచంద్ర ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా వచ్చారు.