నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్ధి కల్వకుంట్ల కవిత విజయం సాధించారు. మొదటి రౌండ్ లోనే ఆమె విజయం సాధించారు. కాంగ్రెస్, బిజెపిలకు కనీసం డిపాజిట్ కూడా రాలేదు. కాసేపట్లో కవితకు గెలుపు ధృవీకరణ పత్రం అందిస్తారు ఎన్నికల సంఘం అధికారులు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత రాజకీయాల్లో కవిత నిశబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత కవితను రాజ్యసభకు సిఎం కేసీఆర్ పంపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అన్నారు. కాని ఆమెను ఎమ్మెల్సీని చేసారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం మంత్రి కేటిఅర్ పక్కా వ్యూహాలు సిద్దం చేసారు.