ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపుని దేశ వ్యాప్తంగా ప్రజలు అందరూ విజయవంతం చేసారు. అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాలు ఎక్కడ చూసినా సరే ప్రజలు అందరూ ఇళ్ళ నుంచి బయటకు రాకుండా కర్ఫ్యూ ని విజయవంతం చేసారు. తెలంగాణాలో కెసిఆర్ ఇచ్చిన పిలుపుని కూడా ప్రజలు విజయవంతం చేసారు. ఉదయం ఆరు గంటల నుంచే ఇళ్ళ నుంచి బయటకు రాలేదు జనం.
ఇక సాయంత్రం 5 గంటలకు ఇళ్ళ నుంచి బయటకు వచ్చి మన కోసం పని చేస్తున్న, డాక్టర్లు, నర్సులు, మున్సిపల్ సిబ్బంది అందరికి కూడా చప్పట్లు కొట్టి దేశ ప్రజలు అందరూ కూడా అభినందించారు. ప్రధాని ఇచ్చిన పిలుపుతో జాతి ఐక్యత చాటారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుటుంబ సభ్యులతో ప్రగతి భవన్ లో, గవర్నర్ సౌందర రాజన్ రాజభవన్ లో, మంత్రులు ఇలా అందరూ కూడా చప్పట్లు కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన నీలం సహాని పలువురు మంత్రులు చప్పట్లు కొట్టి అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యోగా గురు బాబా రామ్ దేవ్ ఇలా అందరూ కూడా చప్పట్లు కొట్టారు. ఆఫీసుల నుంచి బయటకు వచ్చి ఉద్యోగులు, అపార్ట్మెంట్ ల నుంచి బయటకు వచ్చి అందరూ కూడా చప్పట్లతో అభినందించారు, కృతజ్ఞతలు తెలిపారు.
దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కి మంచి స్పందన వచ్చింది. ఎక్కడా కూడా ప్రజల ఇళ్ళ నుంచి బయటకు రాకుండా కరోనా పై యుద్ధం ప్రకటించారు. అన్ని విధాలుగా కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న యుద్దానికి మద్దతు తెలిపారు. కాగా భారత్ లో కరోనా కేసులు 350 వరకు నమోదు అయ్యాయి. తెలంగాణాలో 22 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏడుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.