భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ తో పాటు కేసీఆర్ కలిసి కుట్ర చేస్తున్నారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలనే బీజేపీ ఆలోచననే కేసీఆర్ బయటకు చెప్పాడని అన్నారు. మతతత్వ పార్టీలతో కేసీఆర్ కలిసిపోయాడని విమర్శించారు. మతతత్వ పార్టీలు, ఫ్యూడల్ పార్టీలు కలిసి అంబేధ్కర్ రాశిన భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్నాయని అన్నారు. అలాగే కేంద్ర ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుల కోసం కాదని విమర్శించారు.
బీజేపీ కి విరాళాలు ఇచ్చిన ప్రయివేటు, కార్పోరేట్ కంపెనీల ప్రయోజనాల కోసమే బడ్జెట్ కేటాయించినట్టు ఉందని ఆరోపించారు. కరోనా తో దేశం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోందని అన్నారు. కరోనా మహమ్మారితో దెబ్బతిన్న ఉద్యోగులకు, చిన్న పరిశ్రమల గురించి బడ్జెట్ లో ఉసే లేదని విమర్శించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ లకు బడ్జెట్ లో నిరాశే దక్కిందని విమర్శించారు. అలాగే విభజన హామీల అమలు గురించి ప్రస్తావన కూడా లేదని అన్నారు. ఈ బడ్జెట్ పై పేద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. కానీ వారిని కేంద్ర ప్రభుత్వం అసంతృప్తికి గురి చేసిందని అన్నారు.