దుమ్మురేపుతోన్న‌ కేసీఆర్ బ‌స్సు యాత్ర ట్రైల‌ర్.. వీడియో చూశారా?

-

సార్వత్రిక సమరంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు. బస్సు యాత్రకు శ్రీకారం చుట్టి ప్రజల మధ్యకు వెళ్లనున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర ఈరోజు ఉదయం తెలంగాణ భవన్ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున ఆయన యాత్ర చేయబోయే బస్సుకు పూజలు చేశారు.

మరోవైపు కేసీఆర్ బస్సు యాత్ర నేపథ్యంలో ఓ ట్రైలర్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓవైపు గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను ఎండగడుతూ ఈ ట్రైలర్ సాగింది.  ఇటీవ‌ల కేసీఆర్ మాట్లాడిన మాట‌ల‌ను కూడా ఈ ట్రైల‌ర్‌లో పొందుప‌రిచారు. బీఆర్ఎస్ తెలంగాణ ద‌ళం.. తెలంగాణ గ‌ళం.. అని కేసీఆర్ గ‌ర్జించిన మాట‌లు ట్రైలర్ కు హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news