రేవంత్.. చీర నువ్వు కట్టుకుంటావా.. రాహుల్కు కట్టిస్తావా : కేటీఆర్ కౌంటర్

-

కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై హోరాహోరీ మాటల యుద్ధం సాగుతోంది. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చామన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఐదు హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. కేటీఆర్ చీర కట్టుకొని బస్సెక్కితే హామీలు అమలయ్యేది లేదీ అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.

దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాష్ట్రంలో మహిళలకు 2వేల 500 రూపాయలు ఇస్తామని మోసం చేసినందుకు రేవంత్ నువ్వు చీర కట్టుకుంటావా? లేదా రాహుల్‌ గాంధీకి కట్టిస్తావా? అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ. 2500 నగదు ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలని, ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 యేండ్లు నిండిన ఆడబిడ్డలు మహలక్ష్మి పథకం అడుగుతున్నారని పేర్కొన్నారు.

అమలు చేస్తున్న ఫ్రీ బస్సు పథకమంతా బిల్డప్ అని, అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు. పథకాలన్నింటిని అటకెక్కించిన కాంగ్రెస్కు మహిళల ఓట్లడిగే హక్కు లేదని ఆయన ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news