దేశంలోనే చెత్త నాయకుడు ఎవరో తెలుసా?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఆయనకు ఓపద్ధతి పాడు లేదంటూ విమర్శించారు. ఇండియాటుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ… గతంలో భాజపాతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు ఆతర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో జోడీ కట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అసలు రాజకీయ నేత కాదనీ, ఆయన ఓ మీడియా మేనేజర్ మాత్రమే అన్నారు. చంద్రబాబు దేశంలోనే ఓ చెత్త నాయకుడు.. థర్డ్ క్లాస్ రాజకీయ నేత అని కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, భాజపాలతో తమకు పోటీ లేదని తెలిపారు.

నాడు కాంగ్రెస్ పై వ్యతిరేకంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ కూడా ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమాన్ని ఒక్కరే ప్రారంభించారనీ, తాను కూడా తెలంగాణ ఉద్యమాన్ని అలాగే మొదలుపెట్టుకున్నానని గుర్తుచేశారు. భవిష్యత్ లో భాజపా, కాంగ్రెసేత పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం దేశ వ్యాప్తంగా పర్యటిస్తానని ఆయన తెలిపారు. తెలంగాణలో 95 నుంచి 107 స్థానాలు గెలవనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news