కాజల్ కు ఫిక్సైన భారతీయుడు

-

2.ఓ తర్వాత శంకర్ చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఇండియన్-2. రెండు దశాబ్ధాల క్రితం వచ్చిన ఇండియన్ తెలుగులో భారతీయుడు సినిమాకు సీక్వల్ గా ఇండియన్-2 వస్తుంది. అవినీతి, లంచగొండితనం మీద ఈ సినిమా ఉంటుంది. సీక్వల్ లో కూడా వీటి గురించే ప్రస్థావిస్తారని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో కమల్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తుండగా సినిమాలో మళయాల స్టార్ దుల్కర్, తమిళ హీరో శింభు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ ను సెలెక్ట్ చేశారట. ఖైది నంబర్ 150 తర్వాత మళ్లీ ఫాంలోకి వచ్చిన కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కుర్ర హీరోతో పాటుగా కమల్ లాంటి సీనియర్ స్టార్స్ తో కూడా జతకడుతుంది. ఇండియన్-2లో కాజల్ నటిస్తున్న విషయం ఆమె స్వయంగా ఎనౌన్స్ చేసింది. కమల్ తో కాజల్ మొదటి సినిమా ఇది. శంకర్, కమల్ మరోసారి అద్భుతాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

లైకా ప్రొడక్షన్స్ లోనే ఈ మూవీ కూడా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈమధ్యనే ముహుర్తం పెట్టుకున్న ఈ మూవీ జనవరి నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తుందని తెలుస్తుంది. మరి ఇండియన్ సినిమా సృష్టించిన రికార్డులను ఇది రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news