తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది. ఉద్యోగులు అందరికి సమ్మె కాలపు వేతనాలు చెల్లించడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్న యాజమాన్యం, ఈ నెల 11న చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు గత ఏడాది అక్టోబరు 5 నుంచి నవంబరు 25 వరకు 55 రోజులపాటు సమ్మె చేసారు.
ఆర్టీసి కార్మికులు విధుల్లో చేరమని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన సమయంలో వారికి సమ్మె కాలపు వేతనాలు కూడా ఇస్తామని ప్రకటించారు. అప్పటి వరకు ఆందోళనలో ఉన్న కార్మికులకు అది ఉపశమనంగా మారింది. దాదాపు మూడు నెలల పాటు కార్మికులు జీతాలు లేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. కాగా ఆర్టీసి కార్మికులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు.