కొడంగల్‍: పాలమూరుకు శత్రువులు ఇక్కడే ఉన్నారు..

-


పాలమూరుకు శత్రువులు బయట ఎక్కడోలేరు…ఇదే జిల్లాలో ఉన్నారని తెరాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో తెరాస ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ… ‘‘58 ఏళ్ల కాంగ్రెస్‌, తెదేపా పాలనలో తెలంగాణలో ఏ విధమైన పాలన జరిగింది… నాడు సంక్షేమం ఉండా? ఆనాడు పెన్షన్‌ ఎంత? రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడెలా ఇస్తున్నామో ప్రజలకు తెలుసు. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నాం. గతంలో ఏదైన చిన్న సుస్తీ చేస్తే దవఖానాకు వెళ్లాలంటే వేలకువేలు ఖర్చయ్యేవి…కానీ నేడు పూర్తిగా విరుద్దంగా ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను ప్రభుత్వం అందిస్తోంది అన్నారు. నిరుద్యోగ యువకులకు రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. 24గంటల పాటు విద్యుత్‌ ఇస్తున్నాం. రైతులకు రైతుబంధుతో పాటు రైతు బీమా కల్పిస్తున్నాం. ప్రపంచమంతా రైతుబంధును చూసి ఆశ్చర్యపోతోంది.

ఎంతమందితో కేసీఆర్‌ కొట్లాడాలి? ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారు. అలాంటి చంద్రబాబును కాంగ్రెస్‌ నెత్తిపై పెట్టుకొని తెలంగాణలోకి తెస్తోంది. పాలమూరు దరిద్రం పోవాలంటే అడ్డుపడేవాళ్లకు బుద్ధి చెప్పాలి. 14 ఏళ్లు మడమ తిప్పకుండా నిలబడి పోరాడి.. చావు నోట్లో తలకాయి పెడితే తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణలో పాలన క్రమంగా సాగుతున్న సమయంలో ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేశారు.. అభివృద్ధి అడ్డం పడుతున్నారు అందుకే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల మధ్యలో నే తేల్చుకుందాం అని వచ్చాను… మీరు మరో సారి ఆశీర్వదిస్తే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని హామీ ఇచ్చారు.

కేసీఆర్ తన ప్రసంగం మొత్తంలో ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పేరుని ప్రస్తావించలేదు.. ఉదయం రేవంత్ రెడ్డి అరెస్ట్ తో పాటు నెలకొన్న ఆందోళనల కారణంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news