పేటా తెలుగులో రావడం లేదా..!

-

సూపర్ స్టార్ రజిని ఫ్యాన్స్ కు ముఖ్యంగా తెలుగు ఫ్యాన్స్ కు ఇది మింగుడు పడని వార్తే. తమిళ హీరోనే అయినా రజిని సినిమా అంటే తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడుతుంది. తను నటించే ప్రతి సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసే రజిని ఈమధ్య వరుస ఫ్లాపులతో తెలుగులో ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా చేసుకున్నాడు. లింగా నుండి ఇటీవల వచ్చిన 2.ఓ వరకు భారీ రేటుకి కొనడ నిర్మాతలు లాస్ అవడం ఇదే జరుగుతుంది.

2.ఓ 4 రోజుల్లో 35 కోట్ల దాకా వసూళు చేయగా ఇంకా అంత రాబట్టాల్సి ఉంది. అందుకే 2.ఓ తర్వాత రజిని చేస్తున్న పెట్టా మూవీని తెలుగులో రిలీజ్ చేయదలచుకోలేదట. కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో తెరకెక్కుతున్న పేటా మూవీలో రజిని డాన్ గా కనిపిస్తున్నాడు. భాషా రేంజ్ లో సినిమా ఉంటుందని చెబుతున్న ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేయకపోవడం తెలుగు రజిని ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తుంది.

రాబోయే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న పేటా మూవీ అక్కడ పోస్టర్స్, ఆడియో రిలీజ్ కూడా జరుగుతుండగా తెలుగులో ఇప్పటివరకు కనీసం పోస్టర్ కూడా రాలేదు. దాదాపుగా తెలుగులో పేటా కష్టమే అంటున్నారు. మరి చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news