తెలంగాణా లో కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. దీనితో తెలంగాణాలో లాక్ డౌన్ విషయంలో ఆయన మరో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ అయితే కేసులు ఎక్కువగా ఉన్నాయో… ఆ జిల్లాల్లో లాక్ డౌన్ మే 10 వరకు పెంచే సూచనలు కనపడుతున్నాయి. అవసరం అయితే…
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ జిల్లాలకు భారీగా నిధులు ఇచ్చి ఆదుకోవాలి అని భావిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే మంత్రుల అభిప్రాయం కూడా అయన తీసుకున్నారని సమాచారం. ఆదివారం రెండు గంటలకు తెలంగాణా కేబినేట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గం తో కీలక అధికారులతో చర్చలు జరిపిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.
ఆర్ధికంగా ఇబ్బందులు పడితే పడతాం గాని ఇప్పుడు మాత్రం ఏ చిన్న తేడా జరిగినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాలని అందుకే పోతే పోయింది, అప్పులు అయితే ఇబ్బంది లేదు ఆదాయం పెంచుకుందాం గాని ఇప్పుడు ప్రజల ప్రాణాలు కీలకమని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు లాక్ డౌన్ అక్కడ మరో పది రోజుల వరకు పెంచాలని, హైదరాబాద్ ని అసలు ఇప్పట్లో రీ ఓపెన్ పూర్తి స్థాయిలో చేయవద్దు అని భావిస్తున్నారట.