మహిళకు స్వయంగా మాస్క్ కట్టిన తెలంగాణా మంత్రి…!

-

కరోనా వైరస్ నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు మాస్క్ ని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ నుంచి తప్పుకోవాలి అంటే మాస్క్, సామాజిక దూరం మార్గం అని పలువురు సూచిస్తున్నారు. ఇక తెలంగాణా లో మాస్క్ ని తప్పనిసరి చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనితో అక్కడి ప్రజా ప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు.

ఒక వ్రుద్దురాలికి మంత్రి శ్రీనివాస గౌడ్ స్వయంగా మాస్క్ తొడిగారు. తెల్లరేషన్ కార్దుదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల కోసం రూ.1500 జమ చేసింది. దీనితో మహబూబ్ నగర్‌లోని బ్యాంకులకు జనాలు భారీగా క్యూ కట్టారు. అయినా సరే వాళ్ళు మాస్క్ లు ధరించలేదు. దీనితో వారిలో కొందరికి మాస్క్ లు లేవని గ్రహించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్… ఎస్‌బీఐ బ్యాంకులో మాస్క్ ధరించని ఒక వృద్ద మహిళకు ఆయన స్వయంగా మాస్క్ ఇచ్చారు.

ఆమెకు కట్టుకోవడం రాకపోవడం తో మంత్రే స్వయంగా మాస్క్ కట్టడం గమనార్హం. ఇక తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 50 కి పైగా నమోదు కావడంతో… తెలంగాణా వ్యాప్తంగా కేసుల సంఖ్య 700 దాటింది. మహబూబ్ నగర్ లో 10 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news