విద్యారంగంలో పెను మార్పులు చేపట్టిన ఘనత కేసీఆర్‌దే : జగదీష్‌ రెడ్డి

-

భారతీయ తాత్విక దృక్పథాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అరుదైన ఘనత సర్వేపల్లి సొంతం అన్నారు. మహనీయుల స్ఫూర్తితో విద్యారంగంలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా.. పెను మార్పులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది అన్నారు.

ఇది ఇలా ఉంటె, సూర్యాపేటలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య తల్లిని పరామర్శించడానికి వెళ్తున్న తమకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సూర్యాపేట పట్టణం కాశ్మీర్ కాదని, తాము ఉగ్రవాదులం కాదన్నారు. బీఎస్పీ పార్టీని చూసి మంత్రి జగదీష్ రెడ్డి భయపడుతున్నారని చెప్పారు. వట్టే జానయ్య విషయంపై వాస్తవాలు మాట్లాడుకోవడానికి చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. ఈ విషయంలో తాను ఎక్కడకు రమ్మంటే అక్కడకు వచ్చి చర్చిస్తానని చెప్పారు. డీసీఎంఎస్ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version