ఆర్టీసీ కార్మికుల‌కు షాక్‌.. కేసీఆర్ మ‌రో కీలక నిర్ణయం..

ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్పటికే ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేయడమే కాకుండా.. వారికి వైద్యాన్ని కూడా నిలిపివేసిన కేసీఆర్.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి కసరత్తు చేయాలని… అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు డ్రైవర్‌లు, కండక్టర్ల నియామకంపై.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.